![]() |
![]() |

బిగ్‌బాస్ సీజన్ 4లోకి వెళ్లాక లాస్య లైఫ్ స్టైలే మారిపోయింది. యాంకర్‌గా రవితో కెరీర్ ప్రారంభించిన లాస్య ఆ తరువాత అతనితో విడిపోయి టీవీ షోలకు దూరమైన విషయం తెలిపిందే. మళ్లీ బిగ్‌బాస్ సీజన్ 4 తరువాత మళ్లీ రవితో కలిసి ప్రోగ్రామ్‌లు చేస్తూ యమ బిజీగా మారిపోయింది. తనకంటే చిన్నవాడైన మంజునాథ్‌ని వివాహం చేసుకున్న లాస్యకు ఓ బాబు కూడా వున్నాడు.
.jpg)
అన్యోన్య దాంపత్య జీవితాన్ని లీడ్ చేస్తున్న లాస్య తన పెళ్లిరోజు సందర్భంగా భర్త మంజునాథ్‌ని సర్ప్రైజ్ చేసింది. పెళ్లి రోజు కానుకగా తన భర్తకు కారుని గిఫ్ట్‌గా ఇచ్చి ఆశ్చర్యపరిచింది. మహీంద్రా 500ఎక్స్ యూవీని బహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను యూట్యూబ్‌లోనూ షేర్ చేసింది.
ఈ నెల 15న లాస్య పెళ్లి రోజు కావడంతో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్‌లో భర్తతో కలిసి వెళ్లి కొత్త కారుకి ప్రత్యేక పూజలు చేయించి మురిపిసోయింది లాస్య. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.
.jpg)
![]() |
![]() |